తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!!

తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!!

మూడు రోజులుగా పెరుగుతున్న టెంపరేచర్
జిల్లాలో 38 డిగ్రీలకుపైగా నమోదు
గతంతో పోలిస్తే ముందుగానే ముదురుతున్న ఎండలు
నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి.

వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరువలో ఉంది. మరో రెండు నెలలు వేసవి కాలం ఉండడంతో ప్రస్తుత ఉష్ణోగతలను చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా, 10 ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి.

సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు..

ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి రెండో వారంలోనే 35 డిగ్రీలకు చేరుకొని ఆ తర్వాత 40కి అటు ఇటుగా నమోదవుతుంది. ఈనెల 4న 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈనెల 1న 33 డిగ్రీలు, 2న 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. ఈనెల 4న ఏకంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నాలుగు మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండాలను చూస్తున్న జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న కూలీలు..

వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, రోజువారి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి ఈనెల ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 4,5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడంతో వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూలర్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. పాత వాటికి రిపేర్లు చేయిస్తున్నారు.

  • Related Posts

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…? మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని పాచవ్వ గుట్టలో రంగు రాళ్ల కోసం జరుపుతున్న తవ్వకాలకు నిబంధనలు పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.…

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్