తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై బీసీ సంఘాల ఖండన

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి ౦2 తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేటపో శెట్టి మాట్లాడుతూ, “మల్లన్నను సస్పెండ్ చేయడం బీసీలందరికీ అవమానం” అని వ్యాఖ్యానించారు. బీసీల గొంతుకగా నిలిచిన చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి అగ్రకుల నేతలు పార్టీ లోపల ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ఉన్నా, వారికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ బీసీ నేత మల్లన్నను మాత్రం వెంటనే సస్పెండ్ చేయడం ఆపాదించదగిన చర్య అని ఆరోపించారు. “బీసీలు ప్రశ్నిస్తే సస్పెన్షన్, అగ్రకుల నేతలు విమర్శలు చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం అంటారా?” అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సస్పెండ్ చేయకుండా, ఇప్పుడు ఈ చర్య తీసుకోవడం వెనుక బీసీలపై కాంగ్రెస్‌కు భయం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మల్లన్నకు మద్దతుగా బీసీ సంఘాలు ఒక్కటిగా నిలబడాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీసీల శక్తిని చూపించాలని పిలుపునిచ్చారు.

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు సభలో బీఆర్ఎస్ ఢిల్లీకి పంపే మూటల విషయాలు చర్చకి వస్తాయన్నే మా గొంతు నొక్కుతున్నారు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 13 :- తెలంగాణ…

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

    కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్