

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 09 – ఇటీవల హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం మృతి చెందిన తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి కనిష్క్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కవిత ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, మూసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తెలిసిందే. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కనిష్క్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దాంతో తీగల కృష్ణారెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న కనిష్క్ రెడ్డి తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు, కనిష్క్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు