డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

ప్రతిపాదిత డీలిమిటేషన్ మార్పుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొవాల్సిన సమస్యలపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, యంపి మల్లు రవి హాజరయ్యారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ప్రతినిధుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ఒక సమిష్టి కార్యాచరణ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హక్కులు, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం బలమైన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

  • Related Posts

    బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నార

    బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నారని ప్రత్యేక నిఘా ద్వారా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్.నిజామబాద్ జిల్లా,బాల్కొండ మార్చి 27 మనోరంజని ప్రతినిధి,బాల్కొండ…

    మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్

    మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 27 :-పెండింగ్‌ బిల్లులు అందని సర్పంచ్‌లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ముధోల్ మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌ లను గురువారం పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

    మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

    పుట్టినరోజునాడే యువకుడి దారుణ హత్య

    పుట్టినరోజునాడే యువకుడి దారుణ హత్య

    ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

    ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

    రంజాన్ సందర్భంగా పేద మహిళలకు వస్త్రదానం

    రంజాన్ సందర్భంగా పేద మహిళలకు వస్త్రదానం