జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

మనోరంజని, హైదరాబాద్ ప్రతి నిధి:- హైదరాబాద్, మార్చి 29, 2024: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) లో బి. కిషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, DUFR, JNTUH మరియు యు. రవీందర్ రావు, సూపరింటెండెంట్, UGC వ్యవహారాల విభాగం, JNTUH, కుకట్‌పల్లి, హైదరాబాద్ లకు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. మార్చి 29, 2024న జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, సహోద్యోగులు మరియు ఇతర విశ్వవిద్యాలయ సభ్యులు పాల్గొని, వారిద్దరి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రెక్టర్ డా. కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వర రావు, సీనియర్ అధికారులు, అధ్యాపకులు మాట్లాడుతూ బి. కిషన్ మరియు యు. రవీందర్ రావు అందించిన అమూల్యమైన సేవలను ప్రశంసించారు. వారి కృషి, నిబద్ధత, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేశారు. బి. కిషన్ మరియు యు. రవీందర్ రావు తమ సుదీర్ఘ సేవల కాలంలో అందించిన సహాయ సహకారానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా వారిని సన్మానించి, జ్ఞాపికలు అందజేసి, అనంతరం కృతజ్ఞత గానంతో సభ ముగిసింది.

  • Related Posts

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 04 ;-మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రం, బీసీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఐదవ తరగతి గురుకుల ప్రవేశ…

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మర్చి 28,- మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లొ గల సెంట్ తెరిసా హై స్కూల్ విద్యార్థి నవోదయ ఎంట్రన్స్ లో ఉత్తమ ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే