

చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
మనోరంజని ప్రతినిధి చిత్తూరు మార్చి 11 :- AP: చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే వచ్చి దొంగలను పట్టుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకునట్లు సమాచారం



