

చిట్యాలరామ చంద్రయ్య కు ఘనంగా నివాళులు
మనోరంజని ప్రతినిధి జనగామ మార్చి 16 :- జనగామ జిల్లా పాలకుర్తి పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో చాకలి ఐలమ్మ మనుమడైన చిట్యాల రామ చంద్రయ్య యెుక్క దశదిన సంతాన సభలో తెలంగాణ, బీసీ. ఏ. కులాల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్. జిల్లా కన్వీనర్ సుంకేట పోశెట్టి, రజక సంఘం నాయకులు ఏ. నందు, కే. రవి, లు రామ చంద్రయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ రామ చంద్రయ్య తో కలిసి ఉన్న సమయంలో వారు చూపిన ప్రేమానుబంధాన్ని,మరచిపోలేని, అన్నారు వారితో ఉన్న తీపి జ్ఞాపకాలను తలచుకొంటూ, వారి కుటుంబసభ్యులైన చిట్యాల శ్వేత సంపత్ లను మనోధైర్య నిస్తూ వారు చూపిన బాటలో ముందుకు నడవాలని అన్నారు. అదే విధంగ చిట్యాల శ్వేత ను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించిన సీఎం. హామీని వెంటనే అమలు జరపాలని, వారి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వఉద్యోగం ఇచ్చి గౌరవించాలి, బీసీ హక్కుల నేత సుంకేటపో శెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం లకు డిమాండ్ చేశారు.
