

చావా మూవీ వీక్షించిన శిశు మందిర్ విద్యార్థులు
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 11 :- మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ వారసు డు చత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన ముధోల్ శ్రీ సరస్వతి శి శు మందిర్ పాఠశాల విద్యార్థులు బైంసా పట్టణంలోని కమల థియేటర్ లో చావా మూవీని తిలకించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు సారథి రాజు మాట్లాడుతూ శంభాజీ మహారాజ్ విరోచిత పోరాటపటమను కళ్ళకు కట్టినట్లు చావా చిత్రాన్ని రూపొందించారన్నారు. శంభాజీ మహారాజ్ పోరాటం చరిత్రలో చాలా గొప్పదని ఇలాంటి గొప్ప చరిత్రక సంఘటనలు పోరాటం చేసిన వీరులు భారతీయ చ రిత్రలో ఎందరో ఉన్నారన్నారు. దీంతో విద్యార్థులు శివాజీ మహారాజ్ కి జై శంభాజీ మహారాజ్ కు జై అంటూ నినాదాలతో థియేటర్ మార్మోగింది. పాఠ్యపుస్తకాలలో ఇలాంటివి గొప్ప చరిత్రక సంఘటనలు ఉండాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శివాజీమహ రాజ్, శంభాజీ, మహారాణ ప్రతాప్, పృ ద్వి రాజ్ చవాన్ లాంటి ఎంతోమంది వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేరిస్తే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా చావా మూవీ తిలకించడానికి అవకాశం కల్పించిన కమల థియేటర్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.