కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .


రాజమండ్రి ..


కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

కుల సంఘాలు ఉన్నంత వరకు అంటరాని తనం – పేదరికం విడిచిపోదు..

నేటి సంపన్న వర్గాలు ఒకప్పటి అంటరాని వారాని మరువకండి..

కుల రిజర్వేషన్స్ ముసుగులో సాధించేది ఏమిటి !


మేడా శ్రీనివాస్ , విశ్లేషణ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..


మాల – మాదిగలు గొప్ప కులాలే కదా ! అంటరాని వారు ఎలా అయ్యారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు .. మనిషి జీవన మార్గానికి కులం అవసరం వుందా ! బ్రతకటానికి మతం అవసరం వుందా ! అని చెప్పగల దమ్మున్న మేధావులు ఎవరైనా వుంటే వారితో చర్చకు నేను సిద్దం . కులంతో మనిషికి ఏ అవసరం లేకున్నా కులాన్నే ఎక్కువగా పాలకులు మనిషి జీవితంలో ఎత్తి చూపుతున్నారు . బ్రతకటానికి మతం అవసరం లేకున్నా మతాన్నే ఎక్కువగా లేవనేత్తుతుంటారు . కులం – మతం అంటు రెచ్చగొట్టే వారు సంపన్నులు గాను , పాలకులు గాను చెలామణి అవుతున్నారు . వాటిని నమ్మి ఆచరించే వారందరు కటిక పేదరికాన్ని నెత్తిపై మోస్తుంటారు . సత్య యుగం , త్రేతా యుగం , ద్రోపర యుగం అనంతరం నుండి కులం – మతం అనే నానుడు ఎక్కువగా ప్రచారం పొంది సామాజిక దోపిడికి , ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరపచ్చలు తెచ్చింది. కులం – మతంతో జరిగిన మేలు , అభివృద్ధి , సాధించిన గొప్పతనం చెప్పటానికి ఎవరైనా ఉన్నారా ! వుంటే వారితో ధర్మ బద్ధమైన ఏ పోటికైనా నేను సిద్దం అని ప్రకటిస్తున్నాను . శతాబ్దలుగా కులం – మతం పేరుతో ఆరాచకాన్ని పెంచి పోషించిన రాక్షసుల వారసులే నేడు పాలకులుగాను , సంపన్నులుగాను పాలనను శాసిస్తున్నారు . కులం కేన్సర్ వ్యాధి కన్నా ప్రమాద మైనదని , మతం మహమ్మారి వంటిదని ప్రజలు విశ్వశించి ఆ నాటి కుల – మత వారసులను నేటి తరం రాజకీయంగా మట్టి కరిపించాల్సిన గురుతర బాధ్యతను అందరు చేత పట్టాలని , అప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు .. ఆది కాలంలో కొన్ని దుష్ట శక్తులు బుర్రల్లో నుండి పుట్టిన కులం నేడు రాచపుండు మాదిరి వ్యవస్థను సర్వ నాశనం చేస్తుందని , ఎంతో గౌరవ ప్రధమైన వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా నాటి చండాలులు సృష్టించిన కుట్రను నేడు కుల సంఘాల రూపంలో పెంచి పోషించటం దారుణమైన ఘటన అని , నేటి కుల సంఘాల నేతలు అంటరాని వారికి రిజర్వేషన్స్ పెంచాలి . రాయితీలు ఇవ్వాలి . ప్రత్యేక పథకాలు అమలు చేయాలి . కులాలకు ప్రత్యేక మైన చట్టాలు వుండాలి అంటు కుల సంఘాల వారే నేడు ఉద్యమాలతో డిమాండ్స్ చేస్తుంటుంటే పేదరికం ఎందుకు పోతుంది . అంటరాని తనం ఎందుకు సమసి పోతుంది అని ఆలోచించక పోవటం బాధాకారం . నేను అంటరాని వాడిని కాదు . నా వర్గం ప్రజలు గొప్ప విలువలు సాంప్రదాయాలు గల గారు . నేడు మాకు కావాల్సినది కుల రిజర్వేషన్స్ కాదు సంపదలో రిజర్వేషన్స్ అని కోర కుండా అనాది నుండి నేటి వరకు కుల రిజర్వేషన్స్ కోసమే కుల సంఘాలతో ఉద్యమాలు ఉన్నంతవరకు పెత్తందారి వ్యవ్వస్థ ఉంటూనే వుంటుందని , వారి దోపిడి పరం పర కొనసాగుతూనే వుంటుందని కుల సంఘాలు గ్రహించ నన్నాళ్ళు పెత్తందారి దోపిడి వ్యవస్థకు నీరు పోసి నారు పెంచటం వంటిదేనని , ఆది కాలం నుండి నేటి వరకు ఒక్క శాతం కూడా కుల సంఘాల కారణంగా అభివృద్ధి చూడని వర్గాలాన్ని ఒకే ఒక్కసారి నేను చెప్పిన మార్గాన్ని అనుసరించండి అంటరాని తనం ఉండదు . పేదరికం ఉండదు అని , ఎదగాలని ఆశించే వర్గాలకు , అభివృద్ధి చెందాలనుకునే బిడ్డల తరానికి కేన్సర్ వంటి కుల జెండాను మోయరాదని ఆయన సూచించారు ..

ప్రస్తుతం అగ్ర కులాలుగా
విర్రవీగుతూ అహంకారంతో ఇతర కులాలను తక్కువగాను , అంటరాని వారిగా చూస్తున్న వారంతా ఒకా నోకప్పుడు అంటరాని వారేనని మరువకండి . ఆది కాలంలో చెప్పుకోవటానికి అంటు ఒక వృత్తి లేని వారంతా నేడు అగ్ర కులాలు ఎలా అయ్యారు . వాళ్ళ పూర్వికులు కులానికి ఏ లేకపోయినా వారి కులానికి ఒక గొప్ప చరిత్ర ఉందంట సొంతంగా వీడియోలు చేసుకుంటు సొంత కల్పిత చరిత్రను సృష్టించుకుంటున్నారు . ఆనాడు ఎంతో దూరదృష్టితో మాకు రిజర్వేషన్ ఇవ్వండని , మమ్ములను అంటరాని వారిగా గుర్తించి ప్రభుత్వం రాయితీలు , కుల రిజర్వేషన్స్ ను ఇవ్వండి అంటు కొరకుండా సంపదపై దృష్టి సారించి నేడు గొప్ప వర్ణ చరిత్ర గల వారిపై పెత్తనం చేస్తున్నారు . నిజానికి మాలలే ఆది కాలం నాడు వ్యవసాయం చేసేవారు , కాలక్రమంగా సంస్థానాల్లో రాజ్య భద్రతకు సంబందించిన భాద్యతలు చేపట్టారు . మాదిగ లకు జాంభవంతుడు వంటి గొప్ప చక్రవర్తి , అరుంధతి వంటి మహా శక్తి వంతమైన దేవకి వంటి గొప్ప మూల చరిత్ర నుండి వచ్చారు . ఇక రజకకులు కైతే సాక్షాత్తు అమ్మవారి పవిత్రత గల ఉన్నత స్థితి గల వారిగాను , నాయి బ్రాహ్మణులు శుభ మంగళాలకు ప్రసిద్ధి చెందిన వారిగాను , పద్మశాలి లకు బట్టలు నేత పరిశ్రమ లోను , కుమ్మరి, విశ్వ బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక మైన గ్గుర్తింపు గల వారని , అనేక కులాల వారు సామాజిక ప్రతిష్ట ను , గ్రామ సాంప్రదాయలను ఆచరిస్తు గౌరవ ప్రతిష్ట లకు చిరునామాగా ఉండేవారు . ఏ చరిత్ర లేని కొన్ని బలిచి కొట్టుకుంటున్న వర్గాలు కులాలు అంటు , అంటరాని వారు అంటు వివక్ష చూపుతు అంటరాని వారిగా పిలవ బడుతున్న వారి గొప్ప చరిత్రను నేడు వక్రీకరిస్తు ఆ చరిత్ర స్థానంలో నేడు గొప్ప వారిగా చలామణి అవ్వటానికి ప్రధాన కుట్రనే కారణం . కుల సంఘాల అత్యుత్సాహంతో అయ్యా , బాబు అంటు నేడు ప్రాధేయ పడటమే పేదరికానికి , అంటరాని తనానికి కారణంగా బావించాలని ఆయన తీవ్ర ఆవేదన చెందారు . నేటి సంపన్న వర్గాలుగా డాంబికాలు పలుకుతూ ఇతర వర్గాలను చిన్న చూపుగా చూస్తున్న వారిలో ఎవ్వరు కూడా గొప్ప వారు కాదనేది జగమెరిగిన సత్యం . ప్రస్తుతం పాలక వర్గాల్లో అగ్రకులాలుగా ప్రచారం పొందుతున్న అనేకులు అగ్ర కులాలు కాదనేది వాస్తవం . పాలకుల కుట్రలతో ప్రస్తుతం బి సి లు పిలవబడుతున్న పద్మశాలి , విశ్వ బ్రాహ్మణ కొన్ని ఇతర కులాల వారికి యాజ్నోప వీతం ధరించే అర్హత వుంది . కొన్ని వర్గాల వారు ఉపనయనం పొందే వంశ ఆచారం వుంది . కేవలం సంపద అహకారంతో అగ్రకులాల మంటు గొప్పలు చెప్పుకుంటే చరిత్ర అంగీకరిస్తుందా ! బ్రిటిష్ పాలనా కాలంలో కుట్ర పూరితంగా ఎస్ సి , ఎస్ టి, బి సి , లుగా కుల వర్గీకరణ చేసి తక్కువ కులాలుగా ముద్ర వేస్తే నిజం దాగుతుందా ! పాలకులు ఒక తరహా రాజకీయ కుట్రతో కుల పోరాటాలను ప్రోత్సహస్తు అక్కరకు లేని కుల పోరాటాలను ముందుకు నడిపిస్తున్నారని , ఒక నాటి అంటరాని తెగలు నేడు ఆనాటి గొప్ప తెగలను అంటరాని వారిగా పేర్కొనటం ఆశ్యాస్పందంగా ఉంటుందన్నారు . కుల రిజర్వేషన్స్ ను, కుల పోరాటాలను , వ్యూహత్మకంగా వదులుకుని అధికారాన్ని , సంపదను కైవసం చేసుకునే దిశా రాజకీయ వ్యూహ ప్రతివ్యూహలకు పదును పెడితేనే అంటరానితనం , పేదరికం శాశ్వతంగా దూరమవుతుందని , అప్పటి వరకు కుల వివక్షతకు గురైతూనే వుండాలి . కుల రిజర్వేషన్స్ వద్దు సంపదే ముద్దు అని కోరుకునే వర్గాలకు ముందు ముందు బంగారు భవిష్యత్ వుందని , రాజకీయ ప్రక్షాళన తోనే ఇది సాధ్యం అని , ముందు ముందు ఇప్పటి వరకు విర్రవీగిన సంపన్న పాలక వర్గాలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు .. సభకు అధ్యక్షత వహించిన అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు మాట్లాడుతూ బానిస సంకెళ్ళను తెంచుకుని “మేడా” మార్గంలో పయనిస్తే సంపదతో పాటుగా ఆత్మగౌరవం దక్కుతుందని , మేడా శ్రీనివాస్ నేటి తరం యువతి యువకులkub మార్గదర్శకుడు , ఆదర్శ ప్రాయుడని ఆయన గొప్ప తనాన్ని కొనియాడారు .. ఈ సభలో అర్పిసి సీనియర్ సెక్యూలర్స్ సర్వశ్రీ కాసా రాజు , సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , దోషి నిషాంత్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , వాడపల్లి జ్యోతిష్ , బసా సోనియా , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , ఆకుల మణికాంత్ , అల్లాడ రమేష్ కుమార్ , దోషి సుజల్ , దోషి మొక్ష్, మాసా అప్పాయమ్మ , మాసా అజయ్ , మాసా సుభద్ర , గెడ్డటి సుందరి తదితరులు పాల్గొనియున్నారు ..

  • Related Posts

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా AP: తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందోళనలు చేస్తున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష…

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్జిల్లాల్లో బదిలీలు డ్వామా పీడీలకు అప్పగింత ఏలూరు, మంజీరగళం ప్రతినిధి: ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్