

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు మణికంఠ రెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, తండ్రి తర్పణం చేయడం మహత్తరమైన కర్మగా భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, వేదపండితుల ఆధ్వర్యంలో మాయవర్ బాజారెడ్డి చిత్రపటానికి తర్పణం చేశారు. కుంభమేళా పవిత్రతను ఆస్వాదించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ రెడ్డి, మణికంఠ రెడ్డి పవిత్ర స్నానం ఆచరించి, అక్కడి సాధు సంతులకు అన్నదానం చేశారు. ఇది అక్కడి భక్తులను ఆకట్టుకుంది

