

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు?
ఈసారి రాములమ్మకు అవకాశం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 09- తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను భట్టి.. నాలుగు స్థానాలు రానున్నాయి.అయితే.. ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది హస్తం పార్టీ. కాగా.. మిగతా ముగ్గరు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. పేర్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించగా.. మరొకటి మహిళకు కేటాయిస్తూ.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్‌తో అభ్యర్థులు ఫైన ల్ అయినట్టు తెలుస్తోంది. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారికి కాకుండా.. పార్టీకి చాలా రోజులుగా విధేయంగా ఉన్నవారికి, కీలక వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం