కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం

వీడిన ఉత్కంఠ..

కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం..

మనోరంజని ప్రతినిధి కరీంనగర్: మార్చి 05 :- కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా, నేనా? అన్నట్లు సాగింది. రెండ్రోజులుగా సాగుతున్న కౌంటింగ్‌తో నేడు విజేత ఎవరనేది తేలిపోయింది.కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నీ సొంతం చేసుకుంది. అయితే ఓట్ల లెక్కింపు రెండ్రోజులుగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. నిన్న(మంగళవారం) రాత్రి 12 గంటల వరకూ ఆరు రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరసగా ఐదు రౌండ్లు ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో నరేందర్‌రెడ్డి 211 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.అయితే నేడు సాగిన ఓట్ల లెక్కింపులో అదృష్ఠం బీజేపీ అభ్యర్థిని వరించింది. దీంతో మెుదట్నుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలపై ఒక్కసారిగా పిడుగుపడినట్లు అయ్యింది. కాగా, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.