ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి

ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి

ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. తానూర్ మండలం బొరిగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ బొరిగాం గ్రామస్థుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదివేమెళకువలు, అనుసరించాల్సిన విధానంపై వివరించారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు పై చదువులు చదవడానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మా ప్రజా ట్రస్ట్ సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు మోహన్ రావ్ పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అధ్యాపకులు, ట్రస్ట్ టీం సభ్యులు, బొరిగాం గ్రామస్థులు, తానుర్ మండల నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్