

ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు
హోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు పండుగ శుభాకాంక్షలు తెలిపి, పండుగ చేసుకున్నారు. బైంసా పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్లు, హిందూ ఉత్సవ సమితి నాయకులు, ఆర్ఎస్ఎస్ బాధ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యే తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాలు రంగుల మయం కావాలని ఆకాంక్షించారు

