

న్యూఢిల్లీ, మార్చి 03: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు కేసు విచారణలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేసును మార్చి 25కు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ BR గవాయి స్పందిస్తూ “రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా?”, “ప్రజాస్వామ్యంలో విధానాలు సరిగ్గా ఉండాలా?” అంటూ ప్రాముఖ్యత గల వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు కేసులపై తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల “ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.