

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 18 :- హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సింలు గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిదులుగా తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, జాతీయ కోశాధికారి AV బాలేషం గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి హైకోర్ట్ సీనియర్ న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకులు పచ్చిమడ్ల స్వామి గౌడ్, కొండగోని రవీందర్ గౌడ్, బండి నాగేశ్వర్ రావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, జాతీయ నాయకులు రాగుల సిద్దిరాములు గౌడ్, బాలసాని సురేష్ గౌడ్, AV బాలేషం గౌడ్ లు మాట్లాడుతూ:- గత అసెబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరును పెట్టుతామని, ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని పెట్టుతామని, గీత కార్మిక బీమాను 10 లక్షలకు పెంచి ఇస్తామని, ఖిలశాపూర్ లోని పాపన్న గౌడ్ కొటలను అభివృద్ధి చేస్తామని, కల్లు గీత వృత్తిపై కల్తీ పేరిట దాడులు లేకుండా చేసి గీత వృత్తి ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హమీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోనికి వచ్చి యాడాది గడిచిన అమలు చేయకపోవడం సరైంది కాదని బీసీ సంక్షేమ, రాష్ట్ర రోడ్డు రావణ శాఖ ల మంత్రి వర్యులు గౌడ పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ చోరువ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీప్రకారం జనగామ జిల్లాకు పాపన్న జనగామ జిల్లాగా మార్చి ట్యాంక్ బండ్ పై గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన పాపన్న విగ్రహం పెట్టి కొకపేటలో గౌడ భవనానికి పనులను వెంటనే ప్రారంభించాలి, గీత కార్మిక ప్రమాద బీమాను 5, లక్షల నుండి 10 లక్షలకు పెంచి సరతులు లేకుండా ఇవ్వాలి, పెండింగ్ బీమాలకు నిధులు కేటాయించి పంపిణి చేయాలి, కల్లు గీత కార్పొరేషన్ కు చైర్మన్ తో పాటు పూర్తి కమిటీని ఎన్నుకొని 5, వేల కోట్ల రూపాయలు కేటాయించి కల్లు గీత వృత్తిని అభివృద్ధి చేయాలని, నీర ప్రాజెక్టు ను అన్ని జిల్లాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేకుంటే మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దసల వారి ఆందోళనలు చేయడం జరుగుతుంది న్నారు. గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు