ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక ఐక్యతను, కులాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని సూచిస్తుంది” అని పేర్కొన్నారు. ఇటీవల భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోందని, “మోడీ నాయకత్వంలో మన దేశ ఖ్యాతి మరింత పెరుగుతోంది. కొత్త సంవత్సరం భారత ప్రజలకు శుభసూచకం కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.బీజేపీ కార్యకర్తలంతా కొత్త సంవత్సరంలో బలోపేతానికి కృషి చేయాలని, “ఇప్పటికే బూత్, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయి. త్వరలో రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు చేస్తాము” అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ “మన్ కీ బాత్” కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నందున అందరూ వీక్షించాలని సూచించారు.

  • Related Posts

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ‘న్యాయపథ్’ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సంస్థాగత మార్పులు అలాగే పార్టీకి పునర్ వైభవాన్ని…

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 :-రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

    హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్