ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-

ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల డివిజన్ అధ్యక్షురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 18000 వేల వేతనాలన్ని చెల్లించాలని పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన అశాలకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. పని భారం తగ్గించి, పారితోషికం లేని విధులు నిర్వహించకుండా చూడాలన్నారు. డ్యూటీలు వేసే సందర్భంలో వెహికిల్స్ తో పాటు సిబ్బందిని ఎర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాధ, సులోచన, సావిత, అప్సరీ, ఇంద్ర, సుజాత, మమత, లత, యమున, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!