

ఆయిల్ పామ్ రైతులు ఆందోళన చెందనవసరం లేదు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 03 :-ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్ పామ్ విస్తీర్ణ పథకములో భాగంగా నిర్మల్ జిల్లా లో గత (3) సంవత్సరాలుగా ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి సంవత్సరం (2022-23) లో 1322 రైతులు 3567 ఎకరాలలో, 2023-24 లో 1548 మంది రైతులు 3498 ఏకరాలో, 2024-25 సంవత్సరములో 423 రైతులకు గాను 1073 ఏకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ పంట 36 నెలల తరువాత గెలలు కోత కి రావడం జరుగుతుంది అనగా జూన్ 2025 నెల తరువాత 3500 ఎకరాల లో తోటలు దిగుబడి కి రానున్నవి.మొదటి సంవత్సరం ఏకరాకు సరాసరి 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాకాశం ఉన్నది. మన నిర్మల్ జిల్లా కి అధికారికంగా ప్రీ యూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు కు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం జరిగినది. వీరు సకాలంలో పరిశ్రమ ఏర్పాటు చేయనప్పటికిని ఆయిల్ పామ్ పంటలోని ప్రతి గెలను ప్రీ యూనిక్ కంపనీ కొనవాలసి ఉంటుంది. దీని కొరకు రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను మండలాల వారిగా ఏర్పాటు చేయించడం జరిగుతుంది. అట్టి కేంద్రాలను జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యములో ఫ్రీ యూనిక్ కంపనీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున రైతులు ఆందోళన చెందనవసరం లేదు.ఆయిల్ పామ్ తోటల్లో పండిన ప్రతి గింజను, (గెలను) ప్రీ యూనిక్ కంపనీ ద్వారా కేంద్రాలలో కొనుగోలు చేయడం జరుతుంది. కావున రైతులు నిర్భయంగా ఉండాలని కోరడమైనది. సదరు ప్రీ యూనిక్ కంపనీ కి వీలైనంత త్వరగా పరిశ్రమ (ఫ్యాక్టరీ) పనులు ప్రారంభించాలని ఆదేశించడమైనది