ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా:మార్చి 09 – ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ర‌హ‌దారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందా టీ బైపాస్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివా రం తెల్ల‌వారు జామున 4.20 గంట‌ల స‌మ‌యంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది, ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలా బాద్ నుంచి మ‌హారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక ఐష‌ర్ వ్యాన్ టైర్ ప్ర‌మాద‌వ‌శాత్తు పేలిపో యింది. అనంత‌రం ఆ వాహ‌నం డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహ‌నం ఇండి కేష‌న్ లైట్లు కూడా ఆగిపోయాయి. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ నుంచి జ‌బ‌ల్పూర్ వెళ్తున్న కాంక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు.. వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టడంతో బ‌స్సు డ్రైవ‌ర్‌తో పాటు అందులోనే ఉన్న అద‌న‌పు డ్రైవ‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 10 మంది ప్ర‌యాణి కులు తీవ్రంగా గాయ‌ప‌డ్డా రు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు త‌ర‌లించారు. చాలా వ‌ర‌కు అంద‌రు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్