అలరించిన కుస్తీ పోటీలు.

అలరించిన కుస్తీ పోటీలు.

(మనోరంజని ప్రతినిధి) కుబీర్ మార్చి ౦2 నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామం లో కొనసాగుతున్న శివరత్రి వేడుకలు లో భాగంగా ఆదివారం జరిగిన కుస్తీ పోటీలు అందరిని అలరించాయి. జాతర సందర్బంగా పాలు దుకాణాలు వెలసిన దింతో చివరి రోజైన ఆదివారం రోజున ముందుగా శ్రీ రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి డప్పు చప్పుల మధ్యన ఆలయానికి వచ్చి శ్రీరాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి కుస్తీ పోటీలను ప్రారంభించారు. ముందుగా టెంకాయ తో ప్రారంభమైన కుస్తీ చివరి వరకు కొనసాగాయి. ఈ కుస్తీ పోటీలో పాల్గొనేందుకు కుబీర్ మండలంతో పాటు తానూర్, కుంటాల, బైంసా, మహారాష్ట్ర లోని నాందేడ్, భోకర్, హిమాయత్ నగర్ తో పాటు చుట్టూ ప్రక్కల నుంచి అధిక సంఖ్యలో మల్లాయోధులు హాజరై కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. హోరాహోరీ గా సాగిన ఈ కుస్తీ పోటీలను. తిలికించడనికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 7వేలు నగదు రెండో బహుమతి 3500 అందజేశారు.పార్డి (బి) గ్రామానికి చెందిన ఇందూర్ నర్సయ్య ఆధ్వర్యంలో ఆలయనికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చెపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ అధ్యక్షులు వి.మోహన్ తూము రాజేశ్వర్ పోశెట్టి శేరి సురేష్ గాయకవాడ్ తుకారాం, కుస్తాపూర్ బాబు,మడి ప్రవీణ్,బ్యారప్ కానోబా,ఆయా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఎలాంటి ఆలోచనయ సంఘటన జరగకుండా కుబీర్ ఎస్.ఐ.రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ చెపట్టారు.

  • Related Posts

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్…

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే