అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు.

అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు.

నాళేశ్వర్ జాతరలో అష్ట గంగాధర్ కార్యక్రమం అల్ టైం రికార్డ్.

సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి భక్తులను కడుపుబ్బ నవ్వించిన కవి, గాయకులు ఆష్ట్ర గంగాధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు

మనోరంజని ప్రతినిది నవీపేట్ మార్చి 01 నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా కోన్ని సంవత్సరాల నుండి మహా అన్న ప్రసాదం నిర్వహిస్తారు.అటు ఒక పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనవాయితీ. అయితే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రముఖ కవి గాయకుడు ఆష్ట గంగాధర్ బృందం రాకతో ఎంతో విజయవంతం అయిందని గ్రామస్తులు,భక్తులు,సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు కొనియాడారు.వేలాది జనం తరలి రావడంతో
ఉదయం 9:00 గంటలకి ప్రారంభించిన సాంస్కృతిక కార్యక్రమం ఆష్ట గంగాధర్ తనదైన ప్రత్యేకమైన శైలిలో కొత్త,పాత పాటలతో చలోక్తులతో కూడిన వ్యాఖ్యానంతో దుమ్మురేపే నృత్యాలతో కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో దాదాపు ఆరున్నర గంటలు నిర్వీరమంగా విజయవంతంగా కొనసాగింది. ఒక నిమిషం వీడియోనే స్రోల్ చేస్తున్న ఈ కాలంలో అద్భుతంగా అందరిని తన కళా మాయాజాలంలో ఆరు గంటలకు పాటు జనాలను కూర్చోబెట్టడం ఒక రికార్డె అని,మేము ఆశించినదానికి కార్యక్రమానికి ఆష్ట గంగాధర్ రెండింతలు న్యాయం చేశారని, కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న వాటిని కూడా అవలీలగా పాడుతునే ఇరవై ఏండ్ల కింద మా గ్రామంలో ఎంత జోష్ ప్రదర్శించారో ఇప్పుటికి అంతే ఎనర్జీ తో కార్యక్రమం నిర్వహించడం మమ్ములను అబ్బురపరచిందని గ్రామస్థులు కొనియాడినారు.ఆలయ కమిటీ,గ్రామం అభివృద్ధి కమిటీ తరుపున ఆష్ట గంగాధర్ ను ఘనంగా సత్కరించారు.

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.