అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే గ్రూప్‌-2 ఫలితాలు..!!!

అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే గ్రూప్‌-2 ఫలితాలు..!!!

మనోరంజని ప్రాతినిది హైఫరాబాద్ : గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. నేడు గ్రూప్‌-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి.దీనికి సంబంధించి ఇవాళ అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్‌ ర్యాంకు లిస్ట్‌ను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించింది. అలాగే 1363 గ్రూప్‌-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్‌ వెల్ఫేర్‌, 19న ఎక్స్‌ టెన్షన్‌ ఆఫీసర్‌ ఫలితాలను రిలీజ్‌ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.అటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు నిన్న వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చు. ఈనెల 16 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు మార్కులను చూసుకోవచ్చని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ తెలిపింది. రీకౌంటింగ్‌కు 15 రోజుల గడువు ఉంటుంది. దీనికోసం ప్రతి పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది

  • Related Posts

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 14 -ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ…

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు