అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య?

అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య?

మనోరంజని ప్రతినిధి జగిత్యాల జిల్లా: మార్చి09= ఈరోజు పెళ్లి చేసుకోవల సిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఉందని అందరూ వేడుక ఏర్పాట్లలో మునిగిపోయా రు. కానీ అంతలోనే వరుడు బలవన్మరణానికి పాల్పడడంతో బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుము కున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల పరిధి లోని రాంచంద్రంపేటకు చెందిన లక్కంపల్లి లక్ష్మి – పెద్ద లింబాద్రి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు లక్కంపల్లి కిరణ్ (37) ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం కాగా, ఆదివారం నేడు వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వచ్చాడు అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ముచ్చటించి అనంతరం ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి నిద్రించారు.శనివారం వేకువజామున నిద్ర లేపేందుకు సోదరి గదిలోకి వెళ్లగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కిరణ్ విగతజీవిగా కనిపించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు మరణించడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.సమాచారమందుకున్న పోలీసులు మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించా రు. అనారోగ్య సమస్యలు, మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్