

అదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ అఖిల్ మహాజన్
పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి..
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 10 :- నూతన ఆలోచనలు, పద్ధతులతో పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఐపీఎస్ ల బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు.ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రస్తుత కరీంనగర్ సిపి గౌస్ ఆలం వద్ద నుండి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున సరిహద్దు పై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ ఆక్టివిటీస్ లేకుండా నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయం అని తెలిపారు.