అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం: రేవంత్ రెడ్డి

అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం: రేవంత్ రెడ్డి

మహిళలు రాణించాలంటే చదువుకోవాలన్న రేవంత్ రెడ్డి

మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడి

అవకాశం ఇస్తే మహిళలు నిరూపించుకుంటారని వ్యాఖ్య

అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు రాణించాలంటే చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నూతన భవన నిర్మాణాలకు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. మహిళలకు అవకాశం లభిస్తే వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్