అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండిపోతే ఏం జరుగుతుంది.. శరీరంలో వచ్చే మార్పులేంటి..

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండిపోతే ఏం జరుగుతుంది.. శరీరంలో వచ్చే మార్పులేంటి..

అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లారు. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. మరికొద్ది గంటల్లో వారు భూమి మీదకు రాబోతున్నారు. నెలల తరబడి అంతరిక్షంలో ఉండిపోతే ఏం జరుగుతుంది? వారి శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుంది? అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడపడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, కండరాలు మార్పులకు గురవుతాయి.
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు ఇప్పటివరకు రష్యాకు చెందిన వ్యోమగామి వాలెరి పాలియకోవ్ పేరిట ఉంది. పాలియకోవ్ 1990లలో మిర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజుల పాటు ఉన్నారు. తాజాగా సునీత విలిమయ్స్, బుచ్ విల్‌మోర్ కూడా సుదీర్ఘ కాలం అంతరిక్షంలోనే గడిపారు. వీరికి అంతరిక్షయానం కొత్త కాకపోయినప్పటికీ వీరి శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే శరీరంపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోతుంది. రెండు వారాలకే వారి కండర ద్రవ్యరాశి 20 శాతం తగ్గుతుంది. ఇక సుదీర్ఘ మిషన్లలో పాల్గొనే వారికి 30 శాతం వరకు కండరాల క్షీణత ఉండొచ్చు.
అలాగే శరీరంపై ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల ఎముకలు పోషకాలను కోల్పోతాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గుతుంది. అంతరిక్షంలో గడిపిన ఒక్కో నెలకు వ్యోమగాములు 1-2 శాతం ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. ఇలా జరిగితే చాలా చిన్న ప్రమాదాలకు కూడా ఫ్రాక్చర్లు జరుగుతాయి. అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన తర్వాత ఎముకల ద్రవ్యరాశిని తిరిగి పొందడానికి కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికే అంతరిక్షంలో వ్యోమగాములు వ్యాయామాలు చేస్తారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అదనపు పోషకాలను తీసుకుంటారు.
ఇక, భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటికీ రక్త సరఫరా సజావుగా సాగుతుంది. శరీరంలోని పై భాగాలకు గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. కింది భాగాలకు గురుత్వాకర్షణ కారణంగా రక్త ప్రవాహం జరుగుతుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ రక్తసరఫరా విషయంలో గందరగోళం నెలకొంటుంది. అంతరిక్షంలో రెండు వారాల కంటే ఎక్కువ ఉన్న వారి తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుకభాగంలో, ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది. దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు కారణం అవుతుంది..

  • Related Posts

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    స్వాగతం సుస్వాగతం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ :మార్చి 18: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, పెట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు దాదాపు 9…

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ ! మనోరంజని ప్రతినిధి మార్చి 19 – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

    రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు