హైదరాబాద్ కు వచ్చిన డేవిడ్ వార్నర్

హైదరాబాద్ కు వచ్చిన డేవిడ్ వార్నర్

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – ఐపీఎల్ పుణ్యమా అని ఇండియన్ క్రికెటర్లు మాత్రమే కాక.. విదేశీ ఆటగాళ్లు కూడా భారతీయ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ప్లేయర్స్ జాబితాలో చేరారు. వారిలో ముందు వరుసలో వచ్చే పేరు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. మైదానంలోనే కాక.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు వార్నర్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగ్స్‌కు తగ్గట్టుగా వీడియోలు చేసి నెట్టింట షేర్ చేస్తూ.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి డేవిడ్ వార్నర్ హైద రాబాద్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడడం లేదు మరి హైదరాబాద్ ఎందుకు వచ్చాడబ్బా?అని అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాకకు కారణం మూవీ ప్రమోషన్స్. అవును.. ప్రస్తుతం వార్నర్ నితిన్ హీరోగా వస్తోన్న రాబిన్‌హుడ్ సినిమాలో నటించాడు. ఈ మూవీలో వార్నర్.. డేవిడ్ పాత్రలో యాక్ట్ చేశాడు. నేడు అనగా ఆది వారం నాడు రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనడం కోసం డేవిడ్ వార్నర్ హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

  • Related Posts

    ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా

    ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 30 – ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రెండు ఆసక్తి కరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతీయ…

    బోణి కొట్టిన హైదరాబాద్

    బోణి కొట్టిన హైదరాబాద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి23 – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025ను విజయంతో ప్రారంభిం చింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో, అది రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. ఈ విజయానికి ఇషాన్ కిషన్ అతిపెద్ద హీరో. మొద…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం