

హామీల అమలు నోచుకునేది ఎప్పుడు
అరకొరగా హామీలను అమలు చేస్తే ఊరుకునేది లేదు అర్హులైన పేదలందరికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ దాసు
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, మార్చ్ 2 మనోరంజని ప్రతినిధి, ధర్పల్లి మండలంలో జరిగిన సమావేశంలో ఆరుగ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆ పథకాల అమలు నామమాత్రంగానే అమలవుతున్నాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ దాసు అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై దాసు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు, తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గృహ జ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం, రైతుబంధు, రైతు బీమా రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భృతి, ఇందిరమ్మ ఇల్లు, తదితర హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది, హామీలను పూర్తిస్థా యిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుపరచి అన్ని పార్టీలతో కలుపుగోలుగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు, కేంద్రంలో బిజెపి సర్కార్ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తుందని ఆయన అన్నారు, మతోన్మాదం రోజు రోజుకి పెరిగి వైరస్‌లా మారిందని ఆయన అన్నారు, ఇకనైనా రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలుపరచి మోడీ మతోన్మాద వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట చేయడానికి అన్ని పార్టీలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు, లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వాలకు పడుతుందని ఆయన హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ,భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య,డివిజన్ నాయకులు మార్క్స్, నిమ్మల భూమేష్. సంజీవ్, చిన్న గంగాధర్. శంకర్, పద్మ,వెంకటి, తదితరులు పాల్గొన్నారు.