స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు

స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు

రెహమాన్ ఫౌండేషన్ ద్వారా మృతుని కుటుంబానికి 8000/- వేల రూపాయల నిత్యావసర కిరాణా సరుకులు అందజేత

రెహమాన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం :

జాధవ్ నాను నాయక్ (మాజీ సర్పంచ్ మోతిపటార్)

ప్రతి పేదోడికి రెహమాన్ ఫౌండేషన్ అండగా ఉంటుంది : చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని

మనోరంజని ప్రతినిధి లింగాపూర్ మార్చి 05 :- బుధవారం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం, మోతీపటార్ గ్రామానికి చెందిన పేదరైతు స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులు కాగా బుధవారం దశదిన పెద్దకర్మ కార్యక్రమం కోసం రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని నివాళి అర్పించారు. రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో…… ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ ద్వారా మృతుని సతీమణి కవితా బాయికి 8000/- వేల రూపాయలు నిత్యావసర కిరాణా సరుకులను అందిజేశారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ పేద కుటుంబానికి రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రంజిత్, రాథోడ్ సుభాష్, జాధవ్ రవీందర్, జాధవ్ మారుతీ, జాధవ్ రంజిత్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు.!!

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .