స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

కాలర్ ఐడీ సదుపాయాన్ని తీసుకొస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు

తొలుత సేమ్ నెట్‌వర్క్ మధ్య కాలర్ ఐడీ సదుపాయం
రంగం సిద్ధం చేస్తున్న జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

‘ట్రూ కాలర్’ వంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే మోసపూరిత, అవాంఛిత (స్పామ్) కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ నడుం బిగించింది. ట్రాయ్ తీసుకున్న చర్యలతో ఇకపై ఆయా టెలికం సంస్థలే కాలర్ ఐడీ సేవలను తీసుకురానున్నాయి. అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు ఎలాంటి యాప్ సాయం లేకుండానే స్క్రీన్‌పై కాలర్ పేరు కనిపిస్తుంది. ఇందుకోసం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా హెచ్‌పీ, డెల్, ఎరిక్‌సన్, నోకియా వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నాయి.

దశల వారీగా ఈ సేవలు అందుబాటులోకి రానుండగా, తొలుత ఏ నెట్‌వర్క్ యూజర్‌కు అదే నెట్‌వర్క్ నుంచి వచ్చే కాల్స్‌కు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో యూజర్‌కు ఎయిర్‌టెల్ నుంచి కానీ, వొడాఫోన్ నుంచి కానీ వచ్చే కాల్స్‌కు ఇది వర్తించదు. అయితే, టెలికం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు ఏ నెట్‌వర్క్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కాలర్ ఐడీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్పామ్ కాల్స్‌కు చెక్ పడినట్టే

  • Related Posts

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టం మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 04 :-పార్లమెంట్ ఉభయ సభల్లో…

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కేంద్ర ప్రభుత్వ సాహకారంతోనే పేదలకు సన్న బియ్యం…. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    కేంద్ర ప్రభుత్వ సాహకారంతోనే పేదలకు సన్న బియ్యం…. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

    శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు..!!

    రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు..!!