సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు

సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు

అమరావతి, మార్చి 5 :- ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలజీ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతి రావు, ఎస్టీయు విశాఖ జిల్లాకార్యదర్శి ఇ.పైడి రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎష్.సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సీపీఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్, గుంటూరు జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాశీ విశ్వేశ్వరరావు, తదితరులు ఉన్నారు.


  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి