

శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గిరిజన శక్తి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు- భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ రామనాథ్, నిర్మల్ జిల్లా బంజారా జాక్ సామాజిక చైతన్యకరుడు జాదవ్ విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని లోయపల్లి తండాలో గుర్తు తెలియని దుండగులు శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడం సరికాదన్నారు. అదే స్థలంలో మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే లంబాడీ సమాజం అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేవలాల్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. లంబాడీ సమాజం ఆత్మగౌరవాన్ని కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.