శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

హిందు వాహిని ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శ్రీరామ శోభాయాత్ర

మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రుడని ఆయన రామపాలన స్ఫూర్తితో హిందూ బంధువులు ఏకమై ఐక్యత చాటాలని విశ్వహిందూ పరిషత్ నేత బండారు రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప సమావేశ మందిరంలో హిందు వాహిని అధ్యక్షుడు గుడాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, యువనేత చెట్ల వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 6న సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయవంతం చేయాలని బండారు రమేష్ పిలుపునిచ్చారు. శోభాయాత్ర ఒక గొప్ప కార్యక్రమమని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదర్శ పాలనను అందించి రామరాజ్యాన్ని స్థాపించిన గొప్ప యుగపురుషుడు శ్రీరామచంద్రుడని ఆయన చూపించిన మార్గం పాలన దిశా నిర్దేశం అందరికీ శిరోధార్యం కావాలని నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని హిందూ బంధువులు అందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండారి రమేష్ అందే బాబయ్య పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అగ్గనూరు విశ్వం చెట్ల వెంకటేష్ హిందూ వాహిని అధ్యక్షుడు ,గుడాల రమేష్, అమ్మాపురం శేఖర్ గౌడ్ విశ్వహిందూ పరిషత్ నాయకులు మఠం రాచయ్య, మల్చాలం మురళి, హరి భూషణ్ ,క్యామ మహేష్,మంగ శ్రీశైలం ,శ్రవణ్, సాయి గౌడ్, కాసోజీ శివ, శివశంకర్, అమ్ములు, మ్యాడమోని మధు,చెరకు శివ,రాజు, శ్రీనాథ్, కిరణ్ గౌడ్, అజయ్, ప్యాట అశోక్, మోహన్ సింగ్, కుడుములు బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, రఘునాయక్, విశ్వం, బస్వం, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం మనోరంజని ప్రతినిధి అమరావతి:ఏప్రిల్ 10 – ఒంటిమిట్టలో రమణీ యంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభర…

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా:ఏప్రిల్ 10 – నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.