శిశు మందిర్ని సందర్శించిన అగ్నిమాపక దళం

శిశు మందిర్ని సందర్శించిన అగ్నిమాపక దళం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను భైంసా అగ్ని మాపక దళం (ఫైర్ స్టేషన్) ఎస్సై మదిపెల్లి రవి సందర్శించారు. ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీమాత- ఓంకారం-భరతమాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. అగ్ని మాపక దళ సేవలను అగ్ని ప్రమాదం సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తాను ఆదిలాబాద్ శిశు మందిర్ పూర్వ విద్యార్ధి కావడం ఆనందంగా ఉందని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు విద్యార్థులలో గల భయాన్ని తొలగించి స్ఫూర్తిని నింపడం జరిగింది. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఎస్సైకి పాఠశాల తరుపున ధన్యవాదాలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జీ దేవెందర్ చారి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా..…

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..