

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 02 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న అధికారికంగా నిర్వహించింది. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గా ప్రారంభమై, ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా ఎదిగారని గుర్తుచేశారు. ప్రజల మధ్య మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. శ్రీపాద రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శివరాజ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.