

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి ౦2 ( చంద్రమని సీనియర్ రిపోర్టర్ ) నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్ లోని బైంసా- బాసర జాతీయ రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం జరిగి వానరము మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ హిందూ వాహిని శాఖ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వానరానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ హిందూ వాహిని శాఖ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు