రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి..

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి..

మనోరంజని ప్రతినిధి సిద్ధిపేట మార్చి 07 రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్(50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులోని ఫైరింగ్ రేంజ్ లో ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ కు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారు ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వటైజ్మెంట్ బోర్డు ను ఢీకొట్టింది. కారు లో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి. జవహర్ తలకు, ఛాతీలో గాయాలు గాక కారు డ్రైవర్ కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుకే వస్తున్న మేడ్చల్ పి టి సీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామ శివారు లోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్