రైతుల ప్రైవేటు అప్పులు తీర్చేందుకు ఇక బ్యాంకు రుణాలు

రైతుల ప్రైవేటు అప్పులు తీర్చేందుకు ఇక బ్యాంకు రుణాలు

బ్యాంకర్లు,వ్యవసాయ అధికారులతో న్యాయ సేవాధికారుల సమావేశం

వినియోగించుకోవాలని కోరిన పాకాల శ్రీహరి రావు

మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,12 :- పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం లక్ష రూపాయల మేరకు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు
ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కోరారు.బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశం ఉన్నందున దానికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాల అమలుకు ఎట్టకేలకు ముందడుగు పడింది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న రైతులకు పంట రుణాలతో పాటు,వారు చేసిన ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు మంజూరు చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఇంతకాలం దాచి ఉంచిన బ్యాంకర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో దిగివచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని, ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు రక్షణ సమితి తరఫున శ్రీహరి రావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ విచారించిన ఉన్నత న్యాయస్థానం డబ్ల్యూపి(పిల్) 269/2018 ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొంద వచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలుకు గాను సంబంధిత బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, అర్హులైన రైతులందరికి “ ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి రుణాలు మంజూరు అయ్యే విధంగా చూడాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ సేవా సంస్థల చైర్ పర్సన్లకు,రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గత నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు.ఈ క్రమంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి బి ప్రతిమ, కార్యదర్శి కే వెంకటేష్, తెలంగాణ రైతు రక్షక సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు, సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.ప్రైవేటు అప్పుల కారణంగా రాష్ట్రంలోని రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారి పోతున్న తరుణంలో వారిని ఆ అప్పుల ఊబి నుండి బయటకు తేవాలని, అందుకోసం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, హైకోర్టు ఆదేశాల మేరకు పంట రుణాలకు అదనంగా రైతులకు ప్రైవేట్ అప్పులపై రుణాలు ఇవ్వాలని, అందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.అవసరమున్న రైతులందరికీ, వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి సంబంధిత బ్యాంకులు పంట రుణాలకు అధనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చెయ్యాలని,అప్పు అవసరమున్న రైతులందరు వెంటనే సంబంధిత బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. ఏదైనా కారణాలతో బ్యాంకులు రైతులకు వారి ప్రైవేట్ అప్పులపై రుణాలు మంజూరు చెయ్య లేక పోతే, అందుకు గల కారణాలను రాత పూర్వకంగా రైతులకు తెలపాలని సూచించారు

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు