

రెడ్ల బాలాజీకి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ ప్రదానం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 03 :- హైదరాబాద్, రవీంద్ర భారతి: శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకలో ప్రముఖ కవి, రచయిత, మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ ను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలో జాతీయ ఉగాది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారం, బంగారు పతాకం వంటి గౌరవనీయమైన పురస్కారాలతో పాటు, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఈ పురస్కారాలను ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ మరియు ప్రముఖ సినీ దర్శకుడు సముద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు రెడ్ల బాలాజీ ని హృదయపూర్వకంగా అభినందించారు