రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి – ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం హర్షించదగినదని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత స్వయం ఉపాధి పొందే అవకాశాలు కలుగుతాయని అన్నారు.ఈ పథకంలో ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది చొప్పున, మొత్తం ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 కోట్లు మంజూరు చేసింది. ఒక్క లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు రుణాన్ని అందించడంతోపాటు 60-80 శాతం వరకు రాయితీ ఇవ్వడం గమనార్హమన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమై, ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఆధార్ కార్డు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత పొందిన లబ్ధిదారులకు జూన్ 2న, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరు పత్రాలు అందజేస్తారని చెప్పారు

  • Related Posts

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!! ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరుకొత్త కార్డుల జారీలో గందరగోళంహైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..