“రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు”

“రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు”

నకిలీ జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇకపై పరిస్థితి ఇంకోలా ఉంటుందని వార్నింగ్

జర్నలిస్టుల అంశంపై అసెంబ్లీలో చర్చకు పిలుపు

తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పని చేసే ప్రతినిధులు జర్నలిస్టులా లేకా కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. వాళ్ల కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఊరుకొని ఉంటున్నామని అన్నారు. లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఛానల్స్‌ ఏదో సెటైరిక్‌ స్టోరీలు వేస్తే వాటిని ఆ ఛానల్స్‌ను కేసీఆర్ ఏడాది పాటు బ్యాన్ చేశారని గుర్తు చేశారు. అలాంటిది తాము ఎవర్నీ ఏమి అనడం లేదని తెలిపారు. కానీ జర్నిలిజం ముసుగులో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వాటిని చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు. అసలు జర్నిలిస్టులు అంటే ఎవరని… వారిని అలా గుర్తింపు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. జర్నలిస్టు ముసుగులో చేసే కామెంట్స్‌పై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కొన్ని రెగ్యులరేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదో విష సంస్కృతిలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే చాలా బాధ కలుగుతుందన్నారు రేవంత్. అందుకే దీనిపై అందరూ బాధ్యతగా స్పందించాలని సూచించారు. అవసరమైతే చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. జర్నలిస్టు సంఘాలతో మాట్లాడాలని సూచించారు. జర్నలిజం ముసుగులో కొందరు చేసే వ్యక్తిగత కామెంట్స్‌ను చూస్తుంటే తనతోపాటు చాలా మంది బాధపడుతున్నారని అన్నారు రేవంత్. ఇదే విషయం ప్రజలకు పార్టీ కార్యర్తలకు తెలిస్తే బట్టలూడది రోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారని హెచ్చరించారు. నీచమైన భాషతో వాళ్లు చేసే కామెంట్స్‌లో తన పేరు తీసేసి వాళ్లను ప్రోత్సహించే వాళ్ల పేర్లు పెట్టుకొని చూడలని సూచించారు. ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి చూసీచూడనట్టు వెళ్లిపోతున్నామని ఇకపై ఉపేక్షిస్తే ఇది మరింత పెచ్చురిల్లితుందని ఆందోళన వ్యక్తం చేశారు..

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్