మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – త‌న ప‌రిపాల‌నా దీక్ష నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. దేశంలో రాజ‌కీయ‌, వ్యా పార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది. త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌ వించారు. ఈ జాబితాతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూట‌మిలోని ఇతర ప్ర‌ముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీల‌క నాయ‌కునిగా నిలిపేలా చేశాయి. శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణ‌వ్‌, బీజేపీయే త‌ర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరా మయ్య వంటి నేత‌లు తొలి 25 మందిలో ఉన్నారు.

  • Related Posts

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్..

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్.. హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి…

    చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

    చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.. రంగారెడ్డి జిల్లా ప్రతినిధీ ఏప్రిల్ 1౦ – యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని, ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం