మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

నిజామాబాద్, మనోరంజని చీఫ్ బ్యూరో మార్చి 18 ::ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మిషన్‌ భగీరథ, మెడికల్‌ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. వేసవి కాలంలో ప్రస్తుతం అద్దెలో నడుస్తున్న హాస్టల్‌ లలో నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్‌ కమీషనర్‌ కు సూచించారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్‌, డిప్యూటీ ఈఈ నవీన్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.శివ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయప్రకాష్‌ లు పాల్గొన్నారు.

  • Related Posts

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 21 :- పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని పంచగూడి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులకు మాజీ…

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.