

ముడుపు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అధికారి.!
- హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నాణ్యత నియంత్రణ విభాగం – IIలో డిప్యూటీEXECUTIVEఇంజనీర్‌గా (D.E.E) పనిచేస్తున్న ఎ. దశరథ్ ₹20,000 ముడుపు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.ఇప్పటికే ₹10,000 ముడుపు తీసుకున్న ఆయన, మరిన్ని డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి అతన్ని అడ్డుకున్నారు.అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఎవరైనా ముడుపు కోరితే,1064 కు కాల్ చేయండి అని అధికారులు సూచించారు