మహిళా సాధికారత కోసం బీసీ సేన కదలిక

మహిళా సాధికారత కోసం బీసీ సేన కదలిక

బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్

మహిళలను రాజకీయంగా ప్రోత్సహించే లక్ష్యంతో బీసీ సేన మహిళా కమిటీ

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : మహిళలను రాజకీయంగా ప్రోత్సహించే లక్ష్యంతో బీసీ సేన పని చేస్తుంది అని బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలో బీసీ సేన మహిళా కమిటీ బీసీ సేన నియోజక వర్గ అధ్యక్షులు చంద్ర శేఖరప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది నియోజక వర్గ అధ్యక్షులుగా బాస వరలక్ష్మి ని సోమవారం నియమించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ విచ్చేసి మాట్లాడుతూ, మహిళా సాధికారితపై, బీసీ వర్గాల అభివృద్ధిపై తమ కట్టుబాటు వెల్లడించారు.అధ్యక్షురాలు మాట్లాడుతూ, “బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా, మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగేలా మా బీసీ సేన శక్తివంతంగా పనిచేస్తుందని షాద్ నగర్ నియోజకవర్గంలో మహిళా కమిటీ ఏర్పాటు కావడం ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది మహిళా శక్తికి నూతన దిశను అందిస్తుంది” అని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ రిజర్వేషన్లు, మహిళా సాధికారిత కోసం మరింత బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ సేన ఎల్లప్పుడూ న్యాయ పోరాటాల్లో ముందుంటుంది. మహిళల హక్కుల కోసం నిరంతరం పని చేస్తుంది” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, షాద్ నగర్ కన్వీనర్ సత్యం,టౌన్ అధ్యక్షులు తంగేడు పల్లి శంకర్, కోశాధికారి చందులాల్ ప్రధాన కార్యదర్శి మల్కాపురం రవి అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షులు శివ,పరుఖ్ నగర్ మండల అధ్యక్షులు మేకల వెంకటేష్,కార్యదర్శి జూపల్లి చంద్రశేఖర్ తదితర బీసీ సేన నాయకులు పాల్గొన్నారు..

  • Related Posts

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ. నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కామారెడ్డి టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.