మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి

మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి

మనోరంజని ప్రతినిధి అమరావతి మార్చి 08 – పోసాని కృష్ణ మురళి పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే, ఈ క్రమంలోనే ఆయనను ఇంకో కేసుల్లో ఇప్పుడు మరో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.అయితే శుక్రవారం పోసాని కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరో కేసులో కర్నూలు నుంచి విజయ వాడకు పోసానిని పోలీసు లుఈరోజు తరలిస్తున్నారు. పోసానిపై వివిధ సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసుల్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. అతనికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే.. కడప మొబైల్ కోర్టు పోసాని తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.ఈ నేపథ్యంలో మరో కేసు నిమిత్తం పోసానిని కర్నూ లు నుంచి విజయవాడకు తరలిస్తున్నారని తెలు స్తోంది. ఇందులో భాగం గా… విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో… పీటీ వారెంట్ పై ఆయనను అక్కడకు తీసుకువెళ్లేందుకు విజయ వాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతిం చింది.వాస్తవానికి.. శుక్రవారం అర్థరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది. దీంతో.. విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు జైలుకు చేరుకున్నారు. అనంతరం.. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ (పీటీ వారెంట్) కింద పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు!

  • Related Posts

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి ఆరుగురు పై కేసు నమోదు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై…

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్ భైంసా గ్రామీణ సిఐ నైలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 17 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా ( కే ) గ్రామంలో సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్