మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మెుదటగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్‌ను కుదిపేసింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి 1,664 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. కొండ ప్రాంతాలు, రెబల్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే(యూఎస్జీఎస్‌) వెల్లడించింది. మయన్మార్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం పడింది. పదుల కొద్దీ భవంతులు నెలమట్టం అయ్యాయి. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఆదివారం ఉదయం ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్ర దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు

  • Related Posts

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!!

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!! అమెరికా అప్పగించిన 26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా…

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు ఇండియన్ నేవీ సిబ్బంది.మూడు గంటల పాటు శ్రమించి… ఆపరేషన్ చేసిన ఇండియన్ నేవీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి ఆర్థిక సాహయం

    బాధిత కుటుంబానికి ఆర్థిక సాహయం

    జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిరక్షణ సన్న హ సమావేశ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్

    జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిరక్షణ సన్న హ సమావేశ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్

    పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్

    పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్

    ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

    ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ