భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నా రని,పురుష మా లోకం లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తు న్నదంతా సారాకు తగలే స్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది. బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్‌ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు.. తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారుచేస్తూ విక్రయిస్తు న్నారని తెలిపారు. ఊళ్లో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాది స్తుంటే.. అడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారబోసేస్తున్నారని వాపోయారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై.. తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒక్కటే తక్కువయ్యింది. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు. బుధవారం పోలీ సులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసు కెళ్లిన బాధితులు.. సారాను అడ్డుకోవాలని కోరారు

  • Related Posts

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో…

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదాలలో ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం