భారత్ పరువు తీశారు కదరా ??.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

భారత్ పరువు తీశారు కదరా ??.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

అంయ్హర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భారతదేశ పరువు ప్రపంచంలో దిగజారిపోయింది. గత కొంత కాలంగా మన దేశంలో టూరిస్టులకు భద్రత లేదని మరోమారు రుజువయింది. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారికి సరైన శిక్షలు పడకపోవడంతో కామాంధులు పెట్రిగిపోతున్నారు. మన దేశమంటే అంతర్జాతీయంగా అందరికి అసహ్యం కల్గెలా ఇటీవల పరిణామాలు జరుగుతున్నాయి.మన దేశంలోని అందమైన ప్రదేశాలను చూసేందుకు, మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు విదేశాల నుంచి టూరిస్ట్‌లు తరచుగా వస్తుంటారు. అలాంటి టూరిస్ట్‌లపై దాడులు జరుగుతున్న ఘటనల గురించి అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం. అతిథి దేవోభవ అనేది మన దేశ సంస్కృతి. అతిథులను దేవుళ్లతో సమానంగా చూసుకోవాలని, ముఖ్యంగా మహిళల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించాలని పెద్దలు చెబుతుంటారు. మన దేశంలోని అందమైన ప్రదేశాలను చూసేందుకు, మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు విదేశాల నుంచి టూరిస్ట్‌లు తరచుగా వస్తుంటారు. అలాంటి టూరిస్ట్‌లపై దాడులు జరుగుతున్న ఘటనల గురించి అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం. తాజాగా కర్ణాటక లో విదేశీ మహిళా టూరిస్ట్‌కు దారుణ అనుభవం ఎదురైంది కర్ణాటకలోని హంపి ప్రాంతాన్ని సందర్శించేందుకు ఓ మహిళా టూరిస్ట్ (27) వచ్చింది. హంపీ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఆ మహిళా టూరిస్ట్‌తో పాటు ఇంటి ఓనర్ అయిన మరో మహిళ (29) కూడా గురువారం రాత్రి హంపీ వెళ్లారు. హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపూర్ చెరువు దగ్గర గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆ ఇద్దరు మహిళలపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. ఆ మహిళలు ఇద్దరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీళ్లతో పాటు మరో ముగ్గురు పురుషులు కూడా ఉన్నారు. వారిని కొట్టేసి పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ టూరిస్ట్‌లు సనాపూర్ చెరువు దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వారి దగ్గరకు వచ్చారు. పెట్రోల్‌కు రూ.100 కావాలని అడిగారు. వారు ఇవ్వకపోవడంతో దాడికి దిగారు. అడ్డొచ్చిన ముగ్గురు పురుష టూరిస్ట్‌లపై దాడికి దిగారు. అనంతరం ఇద్దరు మహిళలను గ్యాంగ్ రేప్ చేశారు. శుక్రవారం ఉదయం వారందరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్‌లతో రంగంలోకి దిగారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Related Posts

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి ఆరుగురు పై కేసు నమోదు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై…

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్ భైంసా గ్రామీణ సిఐ నైలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 17 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా ( కే ) గ్రామంలో సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్